Basara Temple

పురాణగాధ

కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇకాడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. వ్యాసుడు ఇక్కడ చెప్పతగింత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతసించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని ఘాడంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్టించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి మార్బుల్ శిల ఉన్నాయి. మంజీరా మరియు గోదావరి తీరాన అష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతుంది.ారవ శతాబ్ధంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయమును నిర్మించాడన్న కధనం ప్రచారంలో ఉన్నది.

ఆలయ విశేషాలు

ఆలయం ప్రాంగణంలో ఉన్న జ్ఞానప్రసూనాంబ బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్టితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక ఋసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞాప్రసూనాంబ చేతిలో ఉన్న అఖంద జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు. నూనె ఇక్కడ ఖరీదుకు లభిస్తుంది. అమ్మవారికి సమర్పించిన చీరలు ఆసక్తి కల భక్తులు కొనుగోలు చేసి పొంద వచ్చు. వెలుపలి కౌంటర్ వద్ద భక్తులు ప్రసాదములు కొనుక్కునే వసతి కూడా ఉంది.

దేవాలయం

సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.

Basara Temple is situated 200 Kms from Hyderabad, AP. Sri Gnana Saraswathi temple at Basara on the banks of river Godavari is the only temple in South India dedicated to the Goddess of learning.

The legend has it that after the Mahabharata war, sage Veda Vyasa embarked on a pilgrimage in search of peace. He reached the serene Kumaranchala hills on the banks of river Godavari and meditated and propitiated the Goddess who eventually appeared before him and granted her presence in the form of the divine trinity.

The Goddess ordered the sage to place three handful of sand at three places everyday. Miraculously these sand dunes transformed into the idols of the divine trinity i.e., Saraswathi, Lakshmi, & Kali.

These are the presiding deities of Basar today. Despite the presence of the trinity,the temple is dedicated to Goddess Saraswathi.

Children are brought here for the ceremony of Akshara puja to start their education with the blessings of the Goddess of Knowledge.The Vedavathi Sila, the Ashtateertha are other places of interest around Basar. Thousands of devotees bath in the river Godavari & seek the blessings of the Goddess during the Mahashivarathri, Dassera navratris and Vasantha panchami.